RSP:కవిత వ్యవహారంలో దుర్మార్గంగా ఈడీ

23
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తీహార్ జైలులో కవితతో ములాఖత్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్…కవిత చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారన్నారు. కవిత దగ్గర ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు. పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుంది? అని ఆర్ఎస్పీ ప్ర‌శ్నించారు.లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీని బీజేపీ వాడుకుంటుంద‌ని ప్ర‌వీణ్ కుమార్ మండిప‌డ్డారు.

Also Read:రకుల్ భర్త షాకింగ్ నిర్ణయం!

- Advertisement -