అసలు స్వేరో ఏంటీ…బండి బ్యాచ్‌కు ఎందుకింత అక్కసు..?

357
swaero
- Advertisement -

చదువే మనిషికి మూలం రా..చదువే మనిషికి జ్ఞానం రా..?చదువు కోవడం కష్టం కాదు..చదువంటే మనకిష్టంరా..?అని అన్నివర్గాల వారికి చదువు ప్రాధాన్యతను చెప్పేలా పాటరాశాడో కవి. నవ సమాజ స్ధాపనలో చదువే మనికి మూలం..ఇది వందశాతం నిజం..అక్షర సత్యం.

అందుకే కులం లేదు మతం లేదు..మనిషికి చదువుంటే బ్రతుకుపై,సమాజంలో జరిగే విషయాలపై అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఎవరి కాళ్లపై వారు నిలబడే ఓ ధీమా వస్తుంది. ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఓ మార్గాన్ని చూపినవారు అవుతారు. అలాంటి చదువును నిమ్నవర్గాల కులాలకు అందాలి..అందరు చదవాలి..చెప్పులు కుట్టిన చేతులతోనే చరితను రాయాలి…ఉన్నత శిఖరాలను అదిరోహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఐపీఎస్‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందులో భాగంగా స్వేరో అనే సంస్థను స్థాపించి చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ ముందుకుసాగుతు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఎంతోమంది విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అంటే సమస్యలకు నిలయాలు…అలాంటి హాస్టళ్లను నేడు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ది. తెలంగాణ గర్వించే బిడ్డ మలావత్ పూర్ణ ను ప్రొత్సహించి ఆమెను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి ప్రపంచానికి తెలంగాణ సత్తాను చాటిన ఘనత ఆయనదే.

వందలాది విద్యార్థులు ఐఐటీ, ట్రిఫుల్ ఐటీ, వంటి సీట్లు, టాటా ఇన్సిటిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి విద్యాసంస్థల్లో సీట్లో సాధించారు. ప్రవీణ్ కుమార్ గురుకులాల అభివృద్ధికి చేస్తోన్న కృషితో ఎంతోమంది విద్యార్థులు ఇందులో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన 7 సంవత్సరాల్లో ఎస్సీ,ఎస్టీ సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ఒక్క ఆరోపణ కూడా రాలేదంటే అది ప్రవీణ్ కుమార్ పనితీరు,నిబద్దతకు నిదర్శనం.

ఈ నేపథ్యంలో అట్టడుగు వర్గాల ప్రజలు విద్యావంతులైతే తమ ఆటలు సాగవని భావించిన బండి అండ్ కో ….స్వేరోకు మతం,కులం రంగు పులిమింది. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ నుండి వచ్చిన ఎడిటింగ్ వీడియోని వైరల్ చేస్తూ ఆయన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారు. మతపరమైన అంశాల ద్వారా ప్రజల్లో తమ రాజకీయాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో భాగంగా ప్రవీణ్ కుమార్‌ని వాడుకునే ప్రయత్నం చేశారు.

స్వేరో ఏ మతానికి వ్యతిరేకం కాదని ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నదే తమ అభిమతమని చెప్పినా బీజేపీ నేతలు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్వయంగా ప్రవీణ్ కుమారే ప్రకటన విడుదల చేసిన విద్వేశాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్వేరో లో అన్ని మతాల వారూ ఉన్నారు. మేం అన్ని మతాల నుంచి మంచిని తీసుకుంటాం. మేం మా ఇళ్ళల్లోనూ లేదా, పనిచేసే చోటా, ఏ మతంపైనా ఏ వ్యతిరేక భావాలనూ ప్రచారం చేయం. అన్ని పండుగలనూ జరుపుకొంటాం. మేం కేవలం ఈ దేశంలో సమ సమాజం కోసం, విద్య, ఆరోగ్య అవగాహన, శాస్త్రీయ దృక్పథం, ఆర్థిక సాధికారత ద్వారా ప్రయత్నిస్తున్నాం. ద్వేషం ద్వారా కాదు అని మరోసారి స్పష్టం చేశారు ప్రవీణ్ కుమార్. మరి ఇప్పటికైనా బీజేపీ నేతలు నిద్రపోతున్నట్లు నటించి ప్రజలను మభ్యపెడతారో లేదా ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి.

- Advertisement -