రూ. 96 వేల కోట్ల ఆస్తులు అమ్మిన కేంద్రం…

178
niramala
- Advertisement -

గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ నగదీకరణ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ. 96,000 కోట్ల విలువైన ఆస్తుల విక్రయాల్ని పూర్తిచేసిందని అధికారులు వెల్లడించారు. ఎన్‌ఎంపీ అమలుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌..నీతి ఆయోగ్‌ సీఈవో, ఆర్థిక శాఖతో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై ఎన్‌ఎంపీ అమలుతీరును సమీక్షించారు.

వివిధ రంగాలకు చెందిన మౌలిక ఆస్తుల్ని విక్రయించి నాలుగేండ్లలో రూ.6 లక్షల కోట్లు సమీకరించేందుకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ ఎంఎన్‌పీని ప్రకటించింది. రవాణా, రహదారుల శాఖ రూ. 23,000 కోట్ల ఆస్తుల్ని విక్రయించగా, విద్యుత్‌ శాఖ రూ.9,500 కోట్లు సమీకరించిందని వెల్లడించింది.

ఈ ఏడాది మొత్తం రూ.1.62 లక్షల కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించగా ఈ లక్ష్య సాధనకు మంత్రిత్వ శాఖలన్నీ కృషిచేయాలని కోరారు నిర్మలా సీతారామన్‌.

- Advertisement -