62.99 లక్షల మంది రైతులకు రూ.7411.52 కోట్లు జమ చేసినట్లు తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని చెప్పారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ.601,74,12,080 కోట్ల నిధులు జమచేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మంది రైతులకు రూ.370,74,52,397 కోట్ల నిధులు,నాగర్ కర్నూలు జిల్లాలో 2,77,920 మంది రైతులకు రూ.367,35,27,173 కోట్ల నిధులు,ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది రైతులకు రూ.356,12,83,145 కోట్ల నిధులు జమచేశామన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 2,94,972 మంది రైతులకు రూ.345,33,35,080 కోట్ల నిధులు,సిద్దిపేట జిల్లాలో 2,94,362 మంది రైతులకు రూ.310,65,93,586 కోట్ల నిధులు ,సూర్యాపేట జిల్లాలో 2,61,079 మంది రైతులకు రూ.309,28,13,804 కోట్ల నిధులు,వనపర్తి జిల్లాలో 1,58,994 మంది రైతులకు రూ.180,40,64,102 కోట్ల నిధులు,అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమచేసినట్లు చెప్పారు.
రైతుబంధుతో కేసీఆర్ వ్యవసాయరంగానికి ఒక దిక్సూచిలా నిలిచారని…రైతుభీమాతో రైతుల ఆత్మబంధువు అయ్యారన్నారు. వ్యవసాయరంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానం అవలంభించాలి….ఉపాధిహామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు….పంటలకు మద్దతుధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలన్నారు.