ఆరు గ్యారెంటీలకే అన్ని వేల కోట్లా?

18
- Advertisement -

తెలంగాణలో ఆరు గ్యారెంటీ హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి హామీలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరో రెండు హామీల అమలు దిశగా కూడా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ హైలెట్ చేస్తున్న ఆరు గ్యారెంటీ హామీలకు అధిక కేటాయింపులు ఉండనున్నాయా ? లేదా ఇతర మౌలిక వసతులకే ప్రాధాన్యం ఉండనుందా ? అనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కేవలం ఆరు గ్యారెంటీల కోసమే దాదాపు రూ.60 వేల కోట్ల బడ్జెట్ కేటాయించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమైనట్లు వినికిడి. మరి ఈ స్థాయిలో కేవలం ఆరు గ్యారెంటీలకే కేటాయింపులు జరిపితే ఇతర మౌలిక వసతులు, సదుపాయాలకు ఎంతమేర కేటాయింపులు జరుపుతారనేది ప్రశ్నార్థకమే. ప్రాజెక్ట్ ల నిర్మాణం, రోడ్ల మరమత్తులు, విద్యార్థుల రీయింబర్స్ మెంట్, ఇతర అవసరాలు,.. ఇలా ఎన్నో విభగాలకు బడ్జెట్ లో తగినంత కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలకు మాత్రమే అధిక బడ్జెట్ కేటాయించి మిగతా విభాగాలకు కోత విధిస్తారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టబోతున్న తొలి బడ్జెట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:‘మంకీ ఫీవర్ ‘ యమ డేంజర్.. జాగ్రత్త!

- Advertisement -