నేటి నుంచే రైతుబంధు చెక్కుల పంపిణీ..

242
rythu bandhu
- Advertisement -

యాసంగి రైతు బంధు చెక్కుల పంపిణీ నేటి నుంచి ప్రారంభంకానుంది. మండల,గ్రామ సభల్లో రైతులకు ఎకరాకు 4వేల పెట్టుబడిని అందించనున్నారు అధికారులు. 18 జిల్లాల్లోని 110 మండలాలకు 11 లక్షల చెక్కులు చేరుకున్నాయి.

ధరణి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 52.15 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. వీరికి 1.37 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరందరికీ చెక్కులు ముద్రిస్తున్నారు. 52 లక్షల మంది రైతులకు రూ.5925 కోట్లు యాసంగి పెట్టుబడి కింద ఇవ్వనున్నారు.

ప్రతిపక్షాలు రైతు బంధును అడ్డుకునేందుకు కుట్రలు పన్నిన న్యాయస్ధానం వాటిని తిప్పికొట్టింది. అయితే చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో రైతుబంధు చెక్కుల పంపిణీ జరుగుతుందా లేదా అని అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఈసీ కూడా అనుకూలంగా ఉండటంతో రైతు బంధుకు క్లియరెన్స్ వచ్చింది.

Image result for rythu bandhu

వర్షాకాలం రైతుబం ధు చెక్కుల పంపిణీ సందర్భంగా ఆర్బీఐ సహకారంతో బ్యాంకుల్లో నగదు కొరత లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. యాసంగి చెక్కుల పంపిణీకి కూడా సహకరించాలని ఆర్బీఐని ఆర్థికశాఖ అధికారులు సంప్రదించారు. ఇటీవల అసెంబ్లీ రద్దవడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడంతో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు లేవు.

- Advertisement -