నీరవ్ మోదీ అస్తులకు చెక్ పెడుతోంది ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) . పీఎన్‌బీ (పంజాబ్ నేషనల్ బ్యాంక్) మెగాస్కాంలో ఈడీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పీఎన్‌బీ మెగాస్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్‌మోదీకి చెందిన విలువైన పలు స్థిర ఆస్తులను శనివారం (నేడు) ఈడీ అధికారులు సీజ్ చేశారు.
పీఎన్‌బీ స్కాం తర్వాతే వార్తల్లో నిలిచిన మోదీ విలాసవంతమైన ఫాం హౌస్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.523.72 కోట్లు ఖరీదు చేసే 21 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. నీరవ్ మోదీతో సంబంధం ఉన్న అన్ని కంపెనీలను ఇప్పటికే ఈడీ సీజ్ చేసిన విషయం తెలిసిందే.
అలీబాగ్‌లో ఉన్న ఫామౌజ్త తో పాటు సోలార్ పవర్ ప్లాంట్‌తో, అహ్మద్‌నగర్‌లో ఉన్న 135 ఎకరాల భూమిని కూడా ఈ కేసులో అటాచ్ చేశారు. అంతేకాకుండా ముంబై, పూణెలో ఉన్న ఆఫీసులను కూడా ఈడీ సీజ్ చేసింది.
కాగా…పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ 1200 కోట్లు ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును సీబీఐ డీల్ చేస్తోంది. దీంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు నీరవ్‌కు చెందిన రూ.6400 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది.
..