మాస్‌ మహారాజాతో ‘సీటీమార్’..

238
- Advertisement -

దర్శకుడు హరీశ్ శంకర్ ప్రస్తుతం ‘దాగుడుమూతలు’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనులతో బిజీగా వున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ .. నితిన్ కథానాయకులుగా నటించనున్నారు. ఈ సినిమా తరువాత ‘సీటీమార్’ అనే సినిమా చేయడానికి హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.

Ravi Teja in Seeti Maar

అయితే ముందుగా సీటీమార్‌ మూవీని నానితో చేయాలనుకున్నాడు. తాను బిజీగా వున్నానని నాని చెప్పడంతో, బన్నీతో చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి బన్నీకి హరీశ్ శంకర్ కథ వినిపించాడా .. లేదా? అనే విషయం తెలియదు గానీ, తెరపైకి తాజాగా రవితేజ పేరు వచ్చింది. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మిరపకాయ్’ మూవీ సక్సెస్ అయింది. ఇప్పుడ మరోసారి వీరిద్దరు కలిసి పనిచేయబోతున్నారు.

అయితే రవితేజ లేటెస్ట్ ఫిలిం టచ్ చేసి చూడు థియేటర్లలో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దీంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా కావడంతోనే రవితేజ సీటీమార్ సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. అతడి సూచనల మేరకు హరీష్ శంకర్ స్క్రిప్ట్ కు తుదిమెరుగుల దిద్దే పనిలో పడ్డాడు. సమ్మర్ నాటికి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.

- Advertisement -