- Advertisement -
తెలంగాణలో రేపు మరో రెండు గ్యారంటీ హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. గృహలక్ష్మి పథకం కింద రూ.500లకే వంటగ్యాస్, మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాల అమలుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను రెడీ చేసిన ప్రభుత్వం.. కొన్ని అంశాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ఎవరెవరు అర్హులు అనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. రూ.500 లకే వంటగ్యాస్ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తింపజేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 90 లక్షలకు పైగానే ఉన్నారు. ఇక ప్రజాపలనలో భాగంగా కొత్తగా వైట్ రేషన్ కార్డుల కోసం 40 లక్షల మందికి పైగానే అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొత్తగా అప్లై చేసుకున్నవారికి కూడా రూ.500 వంటగ్యాస్ పథకం వర్తిస్తుందా అనేది సందేహంగానే ఉంది..
ఇక ఈ పథకంలో సబ్సిడీని నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. ముందుగా వంటగ్యాస్ సిలిండర్ కు పూర్తి నగదు చెల్లించిన తరువాత రూ.500 మినహా మిగిలిన అమౌంట్ అంతా అరుహూలైన వారి ఖాతాలో జమ కానున్నాయి. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల తో కూడా ప్రభుత్వం అన్నీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక రూ.500 వంటగ్యాస్ పథకంతో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని కూడా రేపు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. మరి ఈ రెండు పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు రేపు బహిర్గతం కానున్నాయి. అయితే పథకాల అమలు జరుగుతున్నప్పటికి వాటిని పూర్తి స్థాయిలో కాకుండా కొంతమేరకే అమలు చేస్తోందనే విమర్శ రేవంత్ రెడ్డి సర్కార్ పై గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అమలు చేయబోయే రెండు పథకాలనైనా సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -