నోట్ల కట్టలకు తెరలేపిన కాంగ్రెస్

42
- Advertisement -

ఎన్నికల వేళ ప్రజల మద్దతు లేకపోవడంతో డబ్బుపైనే ఆధారపడింది కాంగ్రెస్. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన నేతలు డబ్బు సంచులతో పట్టు బడుతుండగా తాజాగా డబ్బు సంచులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ సంస్థలకు చెందిన ఉద్యోగులు.

ఎన్నికల్లో ప్రజలను డబ్బులతో మభ్యపెట్టడానికి 50 లక్షల రూపాయలను తరలిస్తూ ఉప్పల్ పోలీసులకు అడ్డంగా దొరికారు. పట్టుబడిన మొత్తాన్ని చెన్నూరు నియోజకవర్గానికి తరలిస్తున్నట్టు ఒప్పుకున్నారు నిందితులు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పట్టుబడిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్. దీంతో కాంగ్రెస్‌ తీరు పట్ల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Also Read:జామ ఆకులతో ఉపయోగాలు తెలుసా!

- Advertisement -