రూ.50తో బెంగళూరుకు రైలు ప్రయాణం

8
- Advertisement -

ఇక నుంచి 50రూపాయలతో అనంతపురం నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణం చేయవచ్చని.. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురం-బెంగళూరు రైలు ప్రారంభోత్సవంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రైల్వే శాఖ అధికారులు, జిల్లా టీడీపీ నాయకులు, మహిళలతో కలసి పాల్గొన్నారు.

అనంతపురం నుంచి రైలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే సునీత వారితో కలసి అదే రైలులో ప్రసన్నాయపల్లి వరకు ప్రయాణించారు. ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ లో రాప్తాడు మండల నాయకులతో కలిసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఘనంగా సన్మానం చేశారు. రైలులో ఉన్న ప్రయాణీకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ నేటితో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైందన్నారు. ఇంత మంచి రోజు.. మంచి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు బెంగళూరుకు వెళ్లాలంటే బస్సుల మీద ఎక్కువగా ఆధారపడే వారని.. అంతే కాకుండా ఛార్జీల ధర ఎక్కువగా ఉండేదన్నారు.

ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నా అందులో సీట్లు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథిలు పార్లమెంట్ లో మాట్లాడి పుట్టపర్తి- బెంగళూరుకు మధ్య నడిచే రైలును అనంతపురం నుంచి బెంగళూరుకు నడిచేలా చేశారన్నారు. ఇందుకు జిల్లా ప్రజల తరుఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. కేవలం 50రూపాయలతోనే ఇక బెంగళూరుకు వెళ్లవచ్చవన్నారు. ఈ రైలు కూలీలు, పేదలకు ఎంతో ఉపయోపగడుతుందన్నారు. అయితే ఈ రైలు మధ్యాహ్నం కాకుండా ఉదయం వేళ ప్రారంభిస్తే.. ఉద్యోగులు, ఉదయం పనులకు వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే సాయంత్రం బెంగళూరు నుంచి బయలుదేరితే అక్కడి నుంచి వచ్చే వారికి కూడా బాగుంటుందన్నారు. మరోవైపు విజయవాడకు వెళ్లే రైళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయని.. పిల్లల చదువులు, అమరావతికి వెళ్లే వారు సీట్లులేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఎంపీలు చొరవ తీసుకుని విజయవాడకు మరో ప్రత్యేక రైలు కానీ లేదంటే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని, కొండవీడును ప్రతిరోజూ నడిచేలా చూడాలని ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తి చేశారు.

Also Read:అతిగా కూర్చుంటే…అనర్థమే

- Advertisement -