- Advertisement -
కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1 నుంచి తొలిదశ, 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన ప్రారంభం కానుంది.
తొలిదశలో ఉత్తరాఖండ్, జమ్ముకాశ్మీర్, లడఖ్, హిమాచల్‌లో కులగణన చేపట్టనుండగా.. రెండోదశలో దేశవ్యాప్తంగా కులగణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో సాధారణంగా జనగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. చివరి జాతీయ జనగణన 2011లో జరిగింది.
2021లో జరగాల్సిన జనగణనను కరోనా మహమ్మారి కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. అందువల్ల 2027లో జరిగే జనగణన 16 సంవత్సరాల తర్వాత మొదటిది కానుంది.
- Advertisement -

