ప్రజల చిల్లర కష్టాలు తీర్చేందుకు ఆర్బీఐ చర్యలు చెపడుతుంది. ఇప్పటికే రూ.2000లకు చిల్లర దొరక నానా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. నిత్యవసర సరుకులు కొన్నలన్న ఈ కొత్త రెండువెయ్యిరూపాయిల నోటుతో చాలా తలనొప్పలు వచ్చిపడ్డాయి. ఒక వైపు పెద్ద నోట్ల రద్దు మరో వైపు చిల్లర సమస్య దీనితో ప్రజలు సతమతమవుతున్నారు. రూ.100నోట్లు ఉన్నవారు వాటిని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటున్నారు.
అయితే చిల్లర సమస్యపై ఆర్బీఐ దృష్టి సారించిది. త్వరలో కొత్త రూ.20, రూ.50 నోట్లను జారీ చేయనుంది. ‘ఎల్’ సిరీస్ ఫార్మాట్‌లో రూ.20 నోట్లను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న రూ.20, రూ.50 నోట్లు యథావిధిగా చలామణీలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో ఆర్‌బీఐ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చిల్లర సమస్య తీవ్రంగా ఏర్పడటంతో రూ.20, రూ.50 నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్‌బీఐ త్వరలో రూ.20 నోట్లను జారీ చేస్తుంది. మహాత్మా గాంధీ సిరీస్-2005లో భాగంగా ఎల్ సిరీస్ ఫార్మాట్‌లో కొత్త నోట్లు ఉంటాయి. వీటిపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు 2016 సంవత్సరం ముద్రించి ఉంటాయి అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించి కొత్త నోట్లను తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
అయితే… సోషల్ మీడియాలో మాత్రం రూ.50 – రూ.20 నోట్లపై వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ల చిత్రాలు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఊహా నోట్ల చిత్రాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే… కొత్తగా వచ్చే రూ.50-రూ.20లపై ఏ చిత్రాలు ఉంటాయో కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.