శరవేగంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం..

485
badugula lingaiah yadav
- Advertisement -

యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని చెప్పారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. రాజ్యసభలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంపై మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 35వేల కోట్ల ఖర్చుతో ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారని తెలిపారు.

కోల్ బాక్స్ విషయంలో సింగరేణి కి అనుమతి ఇచ్చామని…ఇందులో సప్లై చైన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అలాగే ఒక్కో టన్నుకు 600-700 ఖర్చు ఎక్కువగా వస్తుందని చెప్పారు. ఒరిస్సాలో ని మందాకిని బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు సరఫరాకు కేంద్రం అనుమతి ఇవ్వాలన్నారు.

20వేల కోట్లతో నామినేషన్ పనులు బీహెచ్ఈఎల్ కు అప్పగిస్తే.. నిర్మాణంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని… శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టేలా కేంద్రం బీహెచ్ఈఎల్ కు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత కరెంటు అందిస్తున్నాం..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతుల సమస్యలను దూరం చేశారని వెల్లడించారు.

The Yadadri Thermal Power Plant will generate approximately 29,784 million units of energy to meet the future power requirement of …

- Advertisement -