ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్‌లో ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా. ఈ సందర్భంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఐటీ కారిడార్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, బిహార్‌లో పూర్వోదయ పథకం అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని, అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయింపు చేస్తున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి రాజధాని నిర్మాణానికి నిధులు అందజేస్తామని ..పోలవరం ప్రాజెక్టుకు సాయం చేస్తామని వెల్లడించారు.
ఏపీ విభజన చట్టం కింద విద్యుత్, జలవనరులు, రహదారులు, రైల్వే నిర్మాణ కోసం నిధులు కేటాయిస్తామని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక సాయం అందిస్తామని వెల్లడించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఒక నెల వేతనం అడ్వాన్సుగా చెల్లింపు చేస్తామని దీని ద్వారా 2 కోట్ల మంది యువతకు లబ్దిచేకూరుతుందన్నారు.
Also Read:ఈసారి కూడా ‘పేపర్ లెస్’ బడ్జెట్