- Advertisement -
కళియుగ వైకుంఠం,తిరుమల శ్రీవారికి ప్రపంచ నలుమూలలకు చెందిన భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలకు కొదువేలేదు. తమ కోర్కెలు నేరవేరాలని హుండీలో తోచినంత వేసి మొక్కు చెల్లించుకుంటారు.
అయితే తాజాగా ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించాడు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని కలిసిన ఎన్నారై భక్తుడు రూ. 14 కోట్ల చెక్‌ను ఆయనకు అందజేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంక్షేమార్థం ఈ డబ్బును వాడాలని కోరారు. ఎన్నారై విజ్ఞప్తి మేరకు ఆలయ అధికారులు అతడి వివరాలను గోప్యంగా ఉంచారు.
శ్రావణ శుక్రవారం , వరుస సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. మహిళలు ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమపూజ చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ.
- Advertisement -