టైటిల్ సాంగ్‌…కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

707
rgv
- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఇటీవలె మూవీకి సంబంధించి ఒక్కో లీక్‌ని ఇస్తూ వస్తున్న ఆర్జీవీ ఇవాళ టైటిల్ సాంగ్‌ని వదిలారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సీన్‌తో ప్రారంభించిన ఆర్జీవీ.. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాల్లోని సీన్లు.. నేతల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని విజువల్స్ గా వాడారు.

ఏపీలో యుద్ధం చేసే పద్ధతి మారిందని, ఇది కొత్త యుద్ధం అని,నడిచే చట్టమే ఆయుధమని పదునైన పదాలను ఈ పాటలో జోడించారు. ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదనలను జోడిస్తూ ఆర్జీవీ విడుదల చేసిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో వివాదానికి తావే ఉండదని చెప్పిన వర్మ.. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒట్టు వేశారు. అయితే, పాట చూసిన నెటిజన్లు మాత్రం ఖచ్చితంగా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారడం ఖాయమని చెబుతున్నారు.

- Advertisement -