ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. కరోనా దెబ్బకు 213 దేశాలు విలవిలలాడుతుండగా పలు దేశాల ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమైంది. దీంతో కరోనా కట్టడికి సామాజిక దూరం, మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి అన్ని దేశాలు. మాస్క్ ధరించని వారిపై ఫైన్ కూడా విధిస్తున్నారు.
ఇక తాజాగా ఇంగ్లాండ్ మాస్క్ ధరించని వారిపై భారీగా ఫైన్ విధించేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుండి ఇంగ్లండ్ అంతటా బహిరంగ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్ ధరించడం తప్పనిసరని బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మాస్క్‌లు ధరించకపోతే 100 పౌండ్లు (రూ.9438) జరిమానా విధిస్తామని పేర్కొంటూ….. జరిమానా విధించే అధికారాన్ని పోలీసులకు అప్పగించింది.
ఇక కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి యాంటీబాడీ లు కీలకమని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు భావించారు. వాస్తవానికి మన శరీరంలో రోగ నిరోధకశక్తికి యాండీబాటీలు కీలకమని తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడ్డ వారు అతి త్వరగా, తక్కువ కాలంలోనే యాంటీబాడీలను భారీగా కోల్పోతున్నారు. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని తక్కువ కాలంలోనే పేషెంట్లు కోల్పోతున్నారని తాజా పరిశోధనలో తేలింది. ఈ కారణంగా కోవిడ్19 నుంచి కోలుకున్న వారు మళ్లీ మళ్లీ అదే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.