వచ్చే ఐదేళ్లలో తెలంగాణకు రూ.1,09,786 కోట్ల కేటాయింపు..

157
sitharaman
- Advertisement -

ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు.

ఇక వచ్చే ఐదేళ్ళలో తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తం రూ. 1,09,786 కోట్లు అని వెల్లడించారు. కేంద్ర పన్నుల్లో వాటా రూ. 88,806 కోట్లు అని వెల్లడించగా స్థానిక సంస్థలకు కేటాయింపులు రూ. 13,111 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది.

అలాగే ఆరోగ్య రంగానికి రూ. 624 కోట్లు…..పిఎంజిఎస్‌వై(రోడ్లు) రూ.255 కోట్లు….గణాంకాలకు రూ. 46 కోట్లు అని వెల్లడించారు. న్యాయవ్యవస్థ కోసం రూ. 245 కోట్లు…ఉన్నత విద్యకు రూ. 189 కోట్లు అని తెలపగా వ్యవసాయానికి రూ.1665 కోట్లు,రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ. 2362 కోట్లు,విపత్తు నిర్వహణకు రూ. 2483 కోట్లు కేటాయిస్తామని తెలిపింది.

- Advertisement -