రూ.100 లాటరీతో 10 లక్షలు గెలుచుకున్నాడు!

57
lotttery
- Advertisement -

ఇటీవలి కాలంలో లాటరీ కొని లక్షాధికారులు అయిన వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ చిరువ్యాపారికి జాక్ పాట్ తగిలింది. కేవలం రూ. 100తో లాటరి కొనగా 100 లక్షలు గెలుచుకున్నాడు.

అమృత్ స‌ర్‌లో రోడ్డుపైన చిన్న‌పాటి బండిపై వ్యాపారం చేసుకునే వ్య‌క్తి కుమార్తె రూ.100 లాట‌రీ టికెట్ కొనుగోలు చేసింది. ఆ లాట‌రీ టికెట్ తో వారి జీవితాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. వారు క‌ల‌లోసైతం ఊహించ‌ని విధంగా రూ.100 లాట‌రీ టికెట్ కు ఏకంగా రూ. 10ల‌క్ష‌లు గెలుచుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే….అమృత్‌స‌ర్‌కు చెందిన జ‌మాల్ సింగ్ తోపుడు బండిపై వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ‌త ఆదివారం సెల‌వు కావ‌డంతో అత‌డి కుమార్తె హ‌ర్‌సిమ్రాన్ కౌర్ కూడా తండ్రి వెంట వెళ్లింది. ఇదే స‌మ‌యంలో లాట‌రీ టికెట్లు అమ్మే ఓ వ్య‌క్తి వారి దుకాణానికి వ‌చ్చాడు. టికెట్ కేవ‌లం రూ. 100 అని ఒక‌టి కొనుగోలు చేయాల్సిందిగా కోరాడు. అయితే తొలుత జ‌మాల్ సింగ్ అందుకు నిరాక‌రించాడు. కుమార్తె మారం చేయ‌డంతో రూ.10 పెట్టి లాట‌రీ టికెట్ కొనుగోలు చేశాడు.బుధ‌వారం డ్రా నిర్వ‌హించగా బాలిక రూ. 10ల‌క్ష‌లు గెల‌చుకుంది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే జ‌మాల్ సింగ్ కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

- Advertisement -