‘ఆర్ఆర్ఆర్’ మరో 30 దేశాలలో విడుదల సిద్ధం..

97
rrr
- Advertisement -

టాలీవుడ్ భారీ బడ్జెట్‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా 14 భాషలలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా ఊహించినదానికంటే భారీ వసూళ్ళు రాబట్టింది. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇంకా దూసుకుపోతూనే ఉంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మరో 30కి పైగా వివిధ దేశాలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఇటీవల తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్‌లో జపాన్‌లో విడుదలవుతుందని, ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్ – ఎన్టీఆర్‌తో సహా యూనిట్ రెండు రోజుల పాటు ఆ దేశాన్ని సందర్శిస్తామని తెలిపారు. ఈ సినిమాను చైనాలో కూడా విడుదలచేసే అవకాశం ఉందని అన్నారు. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 570 కోట్లకు పైగా షేర్, రూ. 1,045 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -