భారత ఆటగాళ్లకు ఆర్ఆర్ఆర్ టీం విషెస్..

180
rrr

మ‌రికొన్ని గంట‌ల్లోనే జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ గేమ్స్ కోసం ఈసారి ఇండియా ఏకంగా 127 మంది అథ్లెట్ల‌తో కూడిన బృందం ఈ మెగా ఈవెంట్‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. సానియా మీర్జా, సింధు, సాక్షి మాలిక్ వంటి క్రీడాకారుల‌పై అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా తాజాగా ఆర్ఆర్ఆర్ టీం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్…గ‌న్ చేత ప‌ట్టిన రామ్ చ‌ర‌ణ్‌ ఫోటో, బ‌ళ్లెం ప‌ట్టిన ఎన్టీఆర్ పొటోని జ‌త చేసి శుభాకాంక్ష‌లు అందించింది. అక్టోబ‌ర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో కేవ‌లం రెండే మెడ‌ల్స్ గెలిచి తీవ్రంగా నిరాశ ప‌రిచిన ఇండియా ఈ సారి మాత్రం ఎక్కువ మొత్తంలో ప‌త‌కాలు గెల‌వాల‌నే క‌సితో ఉంది.