నరేష్ 58 @ సభకు నమస్కారం

144
naresh

అల్లరి నరేష్ హీరోగా సతీష్ మల్లంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సభకు నమస్కారం. నరేష్ 58వ సినిమా వస్తున్న ఈ మూవీని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

ఇందులో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడట. అరవింద సమేత లో చక్కని నటనను కనబర్చిన నవీన్ చంద్ర కీ రోల్ పోషించనున్నారట. ఇదే ఈ సినిమాకు హైలైట్ కానుందని టాక్‌.

నాందితో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తాజాగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోగా మరి నరేష్ అంచనాలను ఈ మూవీ నిలబెట్టుకుంటుందా లేదా వేచిచూడాలి.