హౌరా బ్రిడ్జి వ‌ద్ద ‘ఆర్ఆర్ఆర్’ టీం హల్‌చల్‌..

80
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజ‌మౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు న‌టించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో రాజ‌మౌళి, తార‌క్, చెర్రీ బిజీగా ఉంటున్నారు. సోమవారం పంజాబ్‌లో ప‌ర్య‌టించిన వీరు మంగళవారం ప‌శ్చిమ బెంగాల్‌లో సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో వారు ముగ్గురూ హౌరా బ్రిడ్జి వ‌ద్ద దిగిన ఫొటోల‌ను ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ప్రాంతంలో వారు ముగ్గురూ స్థానిక మీడియాతోనూ మాట్లాడారు. కాగా,బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి న‌టించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ భాగంగా ప్రోమోలు, టీజ‌ర్స్‌, ట్రైల‌ర్ అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఎన్నాళ్లుగానో RRR రిలీజ్ కోసం ఎంటైర్ పాన్ ఇండియా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది.

- Advertisement -