ఆర్ఆర్ఆర్…మరో అప్‌డేట్

69
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. 2022 జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తికాగా తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిసారించింది చిత్రయూనిట్.

తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చింది. ‘బ్లాస్టింగ్ బీట్స్.. హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్, నవంబర్ 10న’ అంటూ సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్‌, రామచరణ్‌ స్టెపులేస్తున్నట్లు కనిపిస్తుంది.

2022 జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోండు బెబ్బులి కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌‌ల నట విశ్వరూపానికి ఉదాహరణ అనేలా గ్లింప్స్ అదిరిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది ‘ఆర్ఆర్ఆర్’.

- Advertisement -