‘ఆర్ఆర్ఆర్’ నుండి అసక్తికర అప్‌డేట్‌..!

206
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం). ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో RRR గురించిన ఆసక్తికర విషయం తెలిసింది.

ఓవర్సీస్ లో ఐమ్యాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్ లో చిత్రాన్ని ప్రీమియర్ షో గా ప్రదర్శించడానికి ఈ ‘డాల్బీ సినిమా’ టెక్నాలజీని వాడతారు. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాని ప్రపంచంలోనే అతి పెద్ద తెర ఉన్న యూకేలో ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శిస్తున్నారు. ఈ తెరపై డాల్బీ సినిమా టెక్నాలజీతో సినిమాను ప్రదర్శిస్తూండడం విశేషమని చెప్పాలి. డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి భారతీయ చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్’ నిలవబోతోంది.

- Advertisement -