ఆర్ఆర్ఆర్..రిలీజ్ డేట్ కన్ఫార్మ్!

56
rrr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్‌. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడిన రిలీజ్ డేట్ ఎట్టకేలకు కన్ఫార్మ్ అయింది. ఈ సినిమాకోసం రెండు విడుదల తేదీల్ని ఖాయం చేశారు. మార్చ్ 18, ఏప్రిల్ 28. ఈ తేదీల్లో ఒకదాన్ని విడుదల తేదీగా ఫిక్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. సమ్మర్ కానుకగా విడుదల చేస్తేనే అన్ని విధాల బాగుంటుందన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి మలిచిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రం.. టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేశారు. అలాగే.. ప్రమోషనల్ ఈవెంట్స్ తోనూ విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -