ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

58

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.

నీరు, నిప్పు కలిసి ఓ శక్తిలా మారితే ఎలా ఉంటుందో ఈ ఏడాది అక్టోబరు 13న చూస్తారంటూ చిత్రబృందం రిలీజ్ డేట్ ప్రకటించింది. ఇలాంటి ఉత్పాతాన్ని మునుపెన్నడూ చూసి ఉండరని పేర్కొంది. భారత సినిమా చరిత్రలో అతి పెద్ద భాగస్వామ్యంతో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక స్వారీ షురూ అంటూ పేర్కొన్నారు. చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ బుల్లెట్‌పై దూసుకుపోతుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ గుర్ర‌పు స్వారీ చేస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.