ఆర్ఆర్ఆర్…డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ!

84
rrr
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. విడుదలైన ప్రతిచోటా రికార్డులను తిరగరాసిన ఆర్ఆర్ఆర్ తాజాగా డిజిటిల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జూన్ 3న జీ 5, నెట్ ఫ్లిక్స్‌ల‌లో విడుద‌ల‌వుతుంద‌ట‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుందని అంటున్నారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని క్రియేట్ చేసిన RRR డిజిట‌ల్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయ‌నుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. 1920ల్లో బ్రిటీష్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం స్వాతంత్య్ర పోరాట యోధులు .. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా తార‌క్, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ ఇందులో న‌టించారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని వీరిద్ద‌రూ క‌లిసి బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌తో రాజ‌మౌళి ఈ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.

- Advertisement -