అఫీషియల్..భీం టీజర్‌కు ముహుర్తం ఫిక్స్‌!

78
rrr

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్(రణం రుధీరం రౌద్రం). ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తిరిగి ప్రారంభహైంది. ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుండగా ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రామ్ చరణ్ లుక్ టీజర్‌ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఎన్టీఆర్‌ లుక్,భీం టీజర్‌కి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది చిత్ర యూనిట్. అక్టోబర్ 22 న ఉదయం 11 గంటలకు తారక్ భీం టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.