గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎంపీ వెంకటేష్ నేత..

248
MP Venkatesh Netha

రాజ్య సభ సబ్యులకు సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలీ కెరీ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత స్వీకరించారు. ఇందులో భాగంగా రామగుండం ఎన్టీపీసీ స్టేడియంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్, జెడ్పి చైర్మన్ పుట్ట మధుతో కలిసి మొక్కలు నాటారు.

రాష్టంలో కాలుష్య న్ని తగ్గించేందుకు మొక్కలను విరివిగా నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, అయినప్పటికీ రాజ్య సభ సభ్యులు సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ద్వారా సినీ,రాజకీయ ప్రముఖులు మొక్కలను నాటి తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఎంపీ అన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని కాపాడాలని సూచించారు.