రాజమౌళి #RRR మూవీ షూటింగ్ స్టార్ట్..?

252
- Advertisement -

ప్రముఖ తెలుగు దర్శకుడు, ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభాశాలి రాజమౌళి. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కొద్ది రోజుల క్రితమే రాజమౌళి,రామారావు,రామ్ చరణ్ అనేలా #RRR అంటూ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసి అభిమానులలో ఆసక్తిని రేకెత్తించారు మేకర్స్. అయితే.. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత.. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు తమ కొత్త ఫిలిమ్స్ షూటింగ్ స్టార్ట్ చేయడంతో.. రాజమౌళి మూవీ ఆలస్యం అవుతుందనే సంగతి అర్ధమయింది.

Ram Charan

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో అరవింద సమేత మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా నాటికి ఈ మూవీని కంప్లీట్‌ చేసి ఫ్రీ అయిపోతాడు ఎన్టీఆర్. మరోవైపు మెగా హీరో రామ్‌చరణ్‌ కూడా బోయపాటి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో జూలై చివరి నాటికి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయనున్నాడట.

ఇక రాజమౌళి మూవీ #RRR మాత్రం అక్టోబరులో లాంఛ్ చేస్తారట. అదే నెలలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి.. నవంబర్ లో షూటింగ్ బిగిన్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి నాటికి #RRRను విడుదల చేయాలన్నది ప్లాన్.

- Advertisement -