ఆర్ఆర్ఆర్ అసలు టైటిల్ ఇదే..!

678
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది. సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా టైటిల్ పై అనేక అంచనాలు ఉన్నాయి. ఈ మల్టీస్టారర్ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ అన్న వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సరిపోయే టైటిల్ ను చెప్పాలని ఫ్యాన్స్ ను రాజమౌళి కోరగా, ఎన్నో టైటిల్స్ వచ్చాయి.

RRR Movie

తాజాగా చిత్ర టైటిల్‌కు సంబంధించిన ఓ లీక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అన్న టైటిల్‌ను రాజమౌళి సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. ఇక ఇతర భాషల కోసం ‘రైజ్ రివోల్ట్ రివెంజ్’ అన్న టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ, త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం వేసవిలో జూలై 30న ఈ సినిమా విడుదలకు కానుంది.

- Advertisement -