‘ఆర్ఆర్ఆర్ సీక్వెల్’ పై కసరత్తులు

37
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమా ఓ లెవెల్ లో ఆడేసిన తర్వాత పార్ట్ 2 కు కథ అల్లడం అంటే మామూలు విషయం కాదు. ఆర్ఆర్ఆర్ కు కొనసాగింపుగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కథ ఎలా సాగుతుంది ?. ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. మరి కథ ఎవరి పై సాగుతుంది ?, ఎన్టీఆర్ కోసమే ఆర్ఆర్ఆర్ 2 ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు బాగా వినిపించాయి. కానీ, విజయేంద్రప్రసాద్ ఇద్దరి హీరోల కోణంలోనే కథను రాస్తున్నాడని అంటున్నారు. మరీ ఇది నిజమేనా ?, నిజం అయితే.. విజయం సాధించేనా ?. అది అంత సులువు కాదు. ఎందుకంటే ఈ సీక్వెల్ పై అందరి అంచనాలు ఓ లెవెల్ లో ఉంటాయి. పైగా మళ్లీ ఇద్దరు హీరోలు అంటే బోలెడు పరిధులు ఉంటాయి.

అన్నిటికీ మించి విజయేంద్రప్రసాద్ రాసే ఆర్ఆర్ఆర్ సీక్వెల్ తొలిసగంలో, మలిసగంలో వాహ్..వా అనిపించే సీన్లు కొన్ని వుండాలి. కథను నడిపించే సీన్లు కూడా ఊహాతీతంగా వుండాలి. అలాంటి సీన్ల కోసం విపరీతంగా కసరత్తులు చేయాలి. విజయేంద్రప్రసాద్ ఒక్కరే అలా చేయగలరా ?, రాజమౌళి మహేష్ సినిమా పై బిజీగా ఉంటారు. మహేష్ సినిమా పూర్తి అయ్యేలోపు విజయేంద్రప్రసాద్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్క్రిప్ట్ ను ఫినిష్ చేయాలి. ప్రస్తుతానికి అయితే, విజయేంద్రప్రసాద్ తనకు తెలిసిన యంగ్ రైటర్స్, క్రియేటివ్ పీపుల్ తో చర్చలు సాగిస్తున్నారు.

అంతే కాదు, వాళ్లలో మంచి ప్లాట్ ను చెప్పిన వారికి, మంచి ఐడియా షేర్ చేసుకున్నవారికి విజయేంద్రప్రసాద్ గట్టి ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. పైగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్స్ టైటిల్స్ లో పేరు కూడా వేయిస్తా అని అభయం ఇస్తున్నాడు. విజయేంద్రప్రసాద్ కు ఓ అలవాటు వుంది. తన చుట్టూ వున్నావారు, కాస్త క్రియేటివ్ పీపుల్ అనుకున్నవారు అందరితో చర్చలు సాగిస్తారు. వాళ్ల దగ్గర నుంచి అవుట్ పుట్ తీసుకుంటారు. కాబట్టి.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ స్క్రిప్ట్ ఫినిష్ కావడం ఖాయం.

ఇవి కూడా చదవండి…

జబర్దస్త్ షో కొత్త ముచ్చట్లు!

వీరమల్లు ట్రైలర్ ఎప్పుడంటే…

స్టార్లకు అరుదైన గౌరవాలు

- Advertisement -