రివ్యూ:ఆర్ఆర్ఆర్

431
rrr movie
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి మదిలో పుట్టిన అద్భుత సృష్టి ‘రౌద్రం రణం రుధిరం(RRR)’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఈ చిత్రం తెరకెక్కడంతో ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథ:

1920లలో స్వాతంత్ర్యానికి పూర్వం ఆదిలాబాద్ జిల్లాలో తీయబడిన చిత్రం. మల్లిని బ్రిటిష్ వారు కిడ్నాప్ చేయగా భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) ఆమెను తిరిగి తీసుకురావడానికి బాధ్యత వహిస్తాడు. అయితే అతనిని పట్టుకోవడానికి రామ్ (రామ్ చరణ్)బ్రిటిష్ వారి నుండి బహుమానం తీసుకుంటాడు…తర్వాత ఏం జరుగుతుంది…? రాముడు…భీమ్‌ని పట్టుకున్నాడా..?తర్వాత ఏం జరుగుతుంది…తన తప్పు తెలుసుకుని రామ్‌ చివరకు ఏం చేశాడు అన్నదే ఆర్ఆర్ఆర్ కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన,ఇంటర్వెల్ 30 నిమిషానలు,విజువల్స్‌,,సాంగ్స్‌. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ తమ యాక్టింగ్‌తో ఇరగదీశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్, యాక్షన్ ఫీస్ట్. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సినిమాకే హైలైట్‌. మిగతా నటీనటులు తమ పరిధిమేరకు రాణించారు. ఆలియా భట్ నటన సినిమాకు మరింత గ్లామ్ తీసుకొచ్చింది. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్,ఎడిటింగ్‌పై కాస్త దృష్టిసారిస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. కీరవాణి సంగీతం సినిమాకు హైలైట్.సెంథిల్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సీక్వెన్స్‌లు మరియు నైట్ షాట్‌లు అద్భుతంగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

విజువల్ వండర్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఫస్ట్ హాఫ్ జూనియర్ ఎన్టీఆర్ కోసం రిజర్వ్ అయితే, సెకండ్ హాఫ్ చరణ్ కోసం రిజర్వ్ చేయబడింది. ఇద్దరూ పోటీ పడి నటించగా ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ మంచి కిక్ ఇచ్చింది. రాజమౌళి చేసిన మరో మల్టీస్టారర్ ప్రయత్నం సత్ఫలితాన్నివ్వడమే కాదు బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం ఖాయం.

- Advertisement -