ప్రజెంట్ వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ…ట్రిపుల్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, హాలీవుడ్‌లో కూడా క్యూరియాసిటీ నెలకొంది. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ట్రిపుల్ ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. కాగా చిత్ర యూనిట్ అక్టోబర్ 13 న ఆర్‌ఆర్ఆర్ మూవీ విడుదల కాబోతుందని అనౌన్స్ చేసింది. కాని తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీ అక్టోబర్ 13న రిలీజ్ కావడం కష్టమని ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పుడు రాజమౌళి ఉక్రెయిన్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై సిన్మాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
జక్కన్న సిన్మా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్ మరొక ఎత్తు…తనకు నచ్చేవరకు ఏళ్ల తరబడి సీన్లను చెక్కుతూనే ఉంటాడు. ఆ తర్వాత కనీసం రెండు, మూడు నెలలు సిన్మా ప్రమోషన్ మీద కూర్చుంటాడు. దీన్ని బట్టి ఆర్ఆర్‌ఆర్ మూవీ ముందుగా చెప్పినట్లు అక్టోబర్ 13 న రావడం లేదంట…కొత్త తేదీగా క్రిస్మస్ లేదా రిపబ్లిక్‌డేలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే సంక్రాంతి సిన్మాలను డిస్టర్బ్ చేయనని రాజమౌళి ఆయా చిత్రాల నిర్మాతలకు మాట ఇచ్చాడంట..మరి క్రిస్మస్‌కు రిలీజ్ అయినా…సిన్మాకు బాహుబలిని మించిన కలెక్షన్లు రావాలంటే కనీసం 50 రోజులైనా ట్రిపుల్ఆర్‌కు, పెద్ద సిన్మాలకు గ్యాప్ ఉండాలి. దీన్ని బట్టి క్రిస్మస్‌కు రావడం కష్టమే అని చెప్పాలి. ట్రిపుల్ ఆర్ కాస్త పేట్రియాటిక్ మూవీ కాబట్టి రిపబ్లిక్‌డేకు వచ్చే అవకాశాలు ఉన్నాయంట.
ప్రస్తుతం ఉక్రెయిన్ లో వున్న యూనిట్ ఇండియాకు వచ్చి ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన తరువాత పరిస్థితులు అన్నీ పరిశీలించి ఈ మేరకు కొత్త డేట్ ను ప్రకటించే అవకాశం వుంది. కాగా రిపబ్లిక్‌డే రోజున కూడా ట్రిపుల్ ఆర్ రిలీజ్ రావడం కష్టమే అని, వచ్చే సమ్మర్‌లోనే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని మరో టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఉక్రెయిన్ నుంచి వచ్చాకా రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట..మరో వైపు అక్టోబర్ 13 న ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతుందని నమ్మకంతో ఉన్న మెగా, నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలతో కాస్త డిసప్పాయింట్ అవుతున్నారంట.