‘ఆర్ఆర్ఆర్’ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్..

54
- Advertisement -

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన కుదరలేదు. మళ్లీ ఎప్పుడు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. తాజా ప్రకటనతో ఎన్టీఆర్‌, చరణ్‌ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇటు దక్షిణాది .. అటు ఉత్తరాదికి చెందిన చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించనున్నారు.

- Advertisement -