- Advertisement -
రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం భారత చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మెస్మరైజ్ చేయగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టారు.
ఇక యూ ట్యూబ్‌లో ఈ సినిమా పాటలకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. యూట్యూబ్లో సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకోగా అది కాస్త ఇప్పుడు మరో మైల్ స్టోన్ అందుకోబోతుంది.
కీరవాణి అందించిన ఈ సినిమా టోటల్ ఆల్బమ్ ఇప్పటికే పెద్ద చార్ట్ బస్టర్ కాగా ఇప్పుడు ఇది అన్ని భాషల్లో కలిపి 1 బిలియన్ వ్యూస్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. 900 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి ఆ రికార్డు 1 బిలియన్ వైపు దూసుకెళ్తుంది.
- Advertisement -