ప్రపంచమంతా సెన్సేషనల్ హిట్ సాదించి ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ ప్లేస్ లో నిలిచి ఆస్కార్ రేస్ లో ఉన్న RRR జపాన్ లో సరికొత్త రికార్డు అందుకుంది. జపాన్ లో ఈ సినిమా విడుదలై 30 రోజులు దాటేసింది. అక్కడ ఇప్పటికే దాదాపు 300 లకు పైగా యెన్స్ ను కలెక్ట్ చేసి ఔరా అనిపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న అరుదైన ఇండియన్ సినిమాల్లో RRR టాప్ లో నిలిచింది.
RRR తో రాజమౌళి ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాశాడు. వరల్డ్ వైడ్ గా 1200 వందల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ కలెక్షన్స్ తో కలిపి ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ సినిమా అనిపించుకోవడం ఖాయం. ఇంకా జపాన్ లో సినిమా రన్ అవుతుంది. ఫైనల్ రన్ లో 400 నుండి 500 యెన్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ‘రౌద్రం రణం రుధిరం’ ఆస్కార్ రేస్ లో నిలిచింది. మరి ఈ సినిమాకు ఆస్కార్ కూడా దక్కితే ఇక రాజమౌళి పేరు హాలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో మారుమ్రోగడం పక్కా.
ఇవి కూడా చదవండి..