భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’..

47
rrr
- Advertisement -

దేశం మొత్తం దాదాపు మూడున్నరేళ్లుగా ఎదురుచూసిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుండి బాక్సాఫీసు భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. వారం రోజులు గడిచేసరికి వందల కోట్లు కొల్లగొట్టింది.

ఈ భారీ చిత్రం తొలివారం ప్రపంచవ్యాప్తంగా రూ.710 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదే సమయంలో రూ.392.45 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ.60.55 కోట్లు వసూలైతే ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ కు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ మొదటివారం దేశవ్యాప్తంగా రూ.560 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -