ఎట్టకేలకు ఆర్ఆర్‌బీ ఫలితాలు…

32
- Advertisement -

ఆర్‌ఆర్ బీ గ్రూప్ డీ పరీక్షలు రాసిన అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ శుభవార్త తెలపింది. గ్రూప్ డీ ఫలితాలను డిసెంబర్‌24, 2022 రోజున వెల్లడిస్తామని ప్రకటించింది. ఆర్‌ఆర్‌ బీ జారీ చేసిన నోటీస్‌లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ కోసం షార్ట్‌ లిస్ట్‌ చేసి అభ్యర్థుల సీబీటీ ఫలితాలు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపింది.

2019లో వెలువడిన నోటిఫికేషన్‌ను సుదీర్ఘకాలం తర్వాత అంటే కరోనా తర్వాత 2022 ఆగస్ట్‌ 17 నుంచి అక్టోబర్‌11 మధ్య సీబీటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటిఫికేషన్‌లో ఇండియా మొత్తం 103769పోస్టులు ఉన్నాయి. అయితే ఆర్‌ఆర్‌ బీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌ మాత్రం 2023జనవరిలో నిర్వహించనున్నామని ఆర్‌ఆర్‌సీ తెలిపింది.

ఇవి కూడా చదవండి…

భారీగా తగ్గిన బంగారం ధరలు..

పుదీనాతో లాభాలు..

మలంలో రక్తం పడుతోందా.. జాగ్రత్త !

- Advertisement -