టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌..

117
rr

ఐపీఎల్‌-13లో భాగంగా బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతున్నది. రెండు టీమ్‌లు కూడా ఫేవరెట్‌గానే బరిలో దిగుతున్నాయి. వరుసగా రెండు థ్రిల్లింగ్‌ విక్టరీలతో రాజస్థాన్‌ జోరుమీదుండగా, గత మ్యాచ్‌లో గెలుపుతో కోల్‌కతా ఉత్సాహంగా ఉన్నది. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కోల్‌కతా, రాజస్థాన్‌ టీమ్‌లు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తమ విన్నింగ్ టీమ్‌నే కొనసాగిస్తున్నాయి.

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌నరైన్‌, నితీశ్‌ రాణా, దినేశ్‌కార్తీక్‌(కెప్టెన్‌), మోర్గాన్‌, రసెల్‌, కమిన్స్‌, శివమ్‌ మావి, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, కమలేశ్‌ నాగర్‌కోటి.

రాజస్థాన్‌: స్టీవ్ స్మిత్‌(కెప్టెన్‌), బట్లర్‌, సంజు శాంసన్‌, ఉతప్ప, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, టామ్‌ కరన్‌, జొఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, జయదేవ్‌ ఉనద్కట్‌.