- Advertisement -
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఓటమి పాలైంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. రాజస్తాన్ విధించిన 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్కే..6 వికెట్లు కొల్పోయి 176 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 63 పరుగులు చేయగా రవీంద్ర జడేజా (32) రాణించాడు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా 36 బంతుల్లోనే 81 పరుగులు చేయగా ఇందులో10 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో ఓటమి.
Also Read:ఉగాది రాశి ఫలాలు… 2025
- Advertisement -