ఐపిఎల్ 12సీజన్ లో ఆఖరి మ్యాచ్ లో బెంగుళూరు ఘన విజయాన్ని సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు. బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ పై బెంగుళూరు 4వికెట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణిత 20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 175పరుగులు చేసింది. హైదరాబాద్ కెప్టెన్ విలియసన్స్ చెలరేగిపోయాడు. 43బంతుల్లో 70పరుగులు చేసి హైదరాబాద్ కు పెద్ద దిక్కుగా ఉన్నాడు.
ఓపెనర్లు వృద్దిమాన్ సాహా 11బంతుల్లో 20పరుగులు చేయగా, వార్నర్ ప్లేస్ వచ్చిన మార్టిన్ గప్టిల్ 23బంతుల్లో 30పరుగులు చేశాడు. మనీశ్ పాండే కేవలం 9పరగులు మాత్రమే చేసి అవుట్ కాగా, విజయ్ శంకర్ 18బంతుల్లో 27పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, నవ్‌దీప్ సైనీ రెండు వికెట్లు తీయగా చాహల్, కుల్వంత్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక 176పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పార్ధివ్ పటేల్ డకౌట్ అయ్యాడు. కోహ్లి 16పరుగులు, డివిలియర్స్ 1పరుగులకే అవుట్ అయ్యారు. హెట్మయెర్ 47బంతుల్లో 75పరుగులు చేసి బెంగుళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. గుర్ కిరత్ సింగ్ 48బంతుల్లో 65పరుగులు చేశాడు.