నగరం నడిబొడ్డున 125అడుగుల నిలువెత్తు డా.బీఆర్ అంబెద్కర్ కాంస్య విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. బంజారాహిల్స్‌లోని సితార హోటల్లో ప్రజాసంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జల కాంతం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయుకులు, TPUS రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు , బాబు జగ్ జీవన్ రామ్ ఎడ్యుకేషన్ చైర్మన్ కొమ్ముల నరేందర్ , డా. సంజీవ్ , డా. రవీందర్ నాయక్ , బెల్లం మాధవి , క్రాంతి లత గౌడ్ తో పాటు వివిధ కుల సంఘాల నాయకులు , ఉద్యోగ సంఘాలు , విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గజ్జెల కాంతం మాట్లాడుతూ..భారతదేశంలో మొట్టమొదటిసారిగా నూతన సచివాలయానికి డా బీఆర్‌అంబెద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 125అడుగుల కాంస్యవిగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు దళితులు సీఎం కేసీఆర్‌కు ఋణపడి ఉంటామని తెలిపారు. దేశ దళిత ప్రజలందరూ గర్వపడేలా చేసిన సీఎం కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వారసుడు అన్నారు. నేడు మతం పేరుతో బీజేపీ ప్రభుత్వం నడుపుతొందని అన్నారు. దేశ ప్రధాని ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
భారత రాజ్యంగం ప్రకారం నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ ఐటీ దాడులు చేయిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎవరూ కూడా భయపడే వారు ఎవరూ లేరని అన్నారు. లక్షల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతుంటే ఒక్కరిని పట్టుకోలేదని అన్నారు. కానీ ఈ విషయాలను పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే రాహుల్‌గాంధీని మాట్లాడకుండా అనర్హత వేటు వేశారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి…