తెలుగు సినిమాల‌కే నా ప్రాధాన్యం

208
Rouge Movie Villan Takur Anoop Singh
- Advertisement -

రోగ్‌, సింగం3,విన్నర్  సినిమాల‌తో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌టుడు అనూప్ సింగ్ ఠాకూర్‌. లేటేస్ట్ గా అనూప్ న‌టించిన రోగ్ మార్చి 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా అనూప్ మీడియాతో ముచ్చటించారు..

అనూప్ సింగ్ మాట్లాడుతూ – “నేను మూడు సంవ‌త్స‌రాల క్రిత‌మే సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. నేను మ‌హాభార‌తం సీరియ‌ల్‌లో న‌టిస్తున్న‌ప్పుడు నా న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఎలాగైనా పూరి సినిమాల్లో న‌టించాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్పుడు అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో టెంప‌ర్ షూటింగ్ జ‌రుగుతుంటే నేను దూరం నుండి చూశాను. ఇప్పుడు పూరి ద‌ర్శ‌క‌త్వంలో రోగ్ సినిమాతో ప‌రిచ‌యం కావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను మిస్ట‌ర్ వ‌ర‌ల్డ్ అవార్డ్ గెలుచుకున్న దానికంటే పూరి సినిమాలో అవ‌కాశం రావ‌డంతో ఎక్కువ‌గా సంతోషించాను. పూరి నన్ను చాలా కొత్త‌గా చూపించారు. ఆయ‌న‌కు నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. నేను రోగ్‌తో తెలుగు, క‌న్న‌డ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తెలుగు సినిమాల‌కే నా ప్రాధాన్యం ఉంటుంది.

Rouge Movie Villan Takur Anoop Singh

ముంబైలో సెటిల్ అయినా మా పూర్వీకులకు హైద్రాబాద్ తో సంబంధం ఉంది .. తెలుగు సినిమాల్లో ఎవ‌రు క‌ష్ట‌ప‌డితే వారికే ఎక్క‌వ ప్రాధాన్య‌త ఉంటుంది. నేను ఇంకా రెండు సినిమాలు చేస్తున్నాను. నేను మరాఠి భాషలో రెండు సినిమాలలో  హీరోగా కూడా న‌టించ‌బోతున్నాను. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను. అలాగే బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్నాను“ అన్నారు.అంతేకాకుండా బుల్లితెరపై నటించిన అనుభవం వెండితెరపై ఎంతో ఉపయోగపడిందని తెలిపారు..

నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు : అనూప్ సింగం 3 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే…మిస్టర్ వర్డల్ గా పేరుతెచ్చుకున్న అనూప్ సినిమాలలో కూడా రాణించడం చాలా ఆనందంగా ఉందన్నారు..అంతేకాకుండా లేటేస్ట్ పూరీ రోగ్ చిత్రంలో విలన్ పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నాడు..తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని ,నటుడిగా టాలీవుడ్ లో మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని  అన్నారు..

ఈ కార్యక్రమంలో నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వరరావు , పారిశ్రామికవేత్త అంబర్ పేట శంకర్ , ఆర్ కె.గౌడ్ పాల్గోన్నారు..

- Advertisement -