ఆ విషయంలో జక్కన్న కాంప్రమైజ్‌ అయ్యాడు..!

144
SS Rajamouli's Baahubali 2 release date out

రాజమౌళి సినిమాలు అనుకున్న డేట్‌ కి రిలీజ్‌ అవడం కష్టమే. ఎందుకంటే ఆయన సినిమాలో క్వాలిటీ మిస్సయితే ..కరెక్షన్‌ చేసేవరకి వదిలిపెట్టరు. అందుకే రిలీజ్‌ డేట్‌ లు డీలె అవుతుంటాయి. సినిమాలో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తారు. ఇక కరెక్షన్‌ దొరికిందో నో కాంప్రమైజ్‌. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు రాజమౌళి  తన మైండ్‌ ని చేంజ్ చేసుకున్నారు.

SS Rajamouli's Baahubali 2 release date out

అందుకే జక్కన్న బాహుబలి2 విషయంలో మాత్రం ఎక్కువగా కరెక్షన్ల జోలికి వెళ్ళడం లేదట. కారణం….ఇది భారీ అంచనాలతో విడుదలవుతున్న పెద్ద సినిమా కాబట్టి. ఎన్నో అంచనాలతో ప్రేక్షకులకు నిద్రలేకుండా చేస్తుంది ఈ సినిమా. అయితే ఆల్రెడీ ఈ సినిమా డేట్ ని చెప్పేశారు రాజమౌళి. ఇంతకుముందు సినిమాల్లా కాకుండా తన కెరియర్లోనే భారీ బడ్జెట్‌ చిత్రమైన బాహుబలి 2ని మాత్రం అనుకున్నట్టుగా ఏప్రిల్‌ 28నే రిలీజ్‌ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాని మాత్రమే అనుకున్న డేట్‌ కి రిలీజ్‌ చెయ్యాలని జక్కన్న ఫిక్స్‌ అవడానికి కారణం ఈ సినిమా బయ్యర్లే. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా అదే స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకోవాలంటే..సెలవు దినాల్లోనే సాధ్యమని చెప్పేశారట.

 SS Rajamouli's Baahubali 2 release date out

భారీ రేట్లు పెట్టి ఈ చిత్రం హక్కులు తీసుకున్నవారంతా ఖచ్చితంగా వేసవిలోనే సినిమా విడుదల చేయాలని కండిషన్‌ పెట్టారట. దీంతో జక్కన్న కూడా వారి మాటకు అడ్డుచెప్పకపోవడమే మంచిదని అనుకున్నాడు.

అందుకే బాహుబలి2 రిలీజ్‌ డేట్‌లోని కరెక్షన్లకు దూరంగానే ఉన్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఔట్ పుట్‌ బాగుందనిపిస్తే ఎంలాంటి మార్పులు పెట్టకుండా ఓకే చెప్పేస్తున్నారట. మొత్తానికి ఈ సినిమాపై పెట్టిన కోట్ల పెట్టుబడితో రిలీజ్‌ డేట్‌ లను టచ్‌ చెయ్యకుండా రాజమౌళి ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారనే చెప్పాలి.