ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధం!

11
- Advertisement -

తాను ఆస్ట్రేలియా సిరీస్‌కు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్. వచ్చే నెల ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాలో టెస్ట్ శతకం సాధించలేకపోయిన తన దీర్ఘకాల కోరికను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. రూట్ ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 27 ఇన్నింగ్స్ ఆడినా, ఒక్క శతకం సాధించలేకపోయాడు. అయితే తొమ్మిది అర్ధశతకాలు సాధించాడు — అందులో గరిష్ఠ స్కోరు 89, 2021లో బ్రిస్బేన్‌లో జరిగిన గత యాషెస్ సిరీస్‌లో చేశాడు రూట్.

ఇంగ్లాండ్ చివరిసారి యాషెస్ కోసం ఆస్ట్రేలియా పర్యటించిన నాలుగు సంవత్సరాల కాలంలో రూట్ … భారీ రన్స్ సాధిస్తూ తన ఆటను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. 2021లో రూట్ 1708 పరుగులు చేయగా 2022లో 1098 (27 ఇన్నింగ్స్), 2023లో 787 (14 ఇన్నింగ్స్), 2024లో 1556 (31 ఇన్నింగ్స్) పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా -ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 21న పెర్త్‌లో ప్రారంభమవుతుంది.

Also Read:జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

- Advertisement -