రొమాంటిక్…స‌క్సెస్ మీట్‌

81
romantic
- Advertisement -

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను సోమవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రొమాంటిక్‌ చిత్రయూనిట్ పాల్గొంది. ఈ సంద‌ర్భంగా…

లిరిసిస్ట్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. ‘ప్రతీ పాటను అద్భుతంగా తెర‌కెక్కించారు. నా వల్లే కాదే అనే పాట నాకు చాలా ఇష్టం. షూట్ చేశాక.. ఆ విజువల్స్ చూశాక ఆ పాటను అంత రొమాంటిక్‌గా రాశాను. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ వల్లే ఈ పాటలు ఇంత బాగా వ‌చ్చాయి“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘నా వల్లే కాదే అనే పాటను మొదటగా కంపోజ్ చేశాం. ఆ తరువాత మూడేళ్లు మనం ప్రయాణం చేశాం. ప్రతీ రోజూ అద్భుతంగానే అనిపించింది. పూరి గారు, భాస్కర భట్ల గారి నుంచి తెలుగును నేర్చుకోవచ్చు. ఎంతో మంచి సాహిత్యాన్ని అందించారు. అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయిందంటే దానికి ప్రేక్షకులే“ అని అన్నారు.

దర్శకుడు అనిల్ పాదూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను నాకు ఇచ్చినందుకు పూరి జగన్నాథ్, ఛార్మీ గారికి థ్యాంక్స్. రవి అవానా నా కోసం మొత్తం లుక్కునే మార్చుకుని వచ్చారు. ఖయ్యుమ్, నవీన్, అజీజ్ ఇలా అందరూ బాగా నటించారు. జునైద్ గారు సినిమాను అద్భుతంగా కట్ చేశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మకరంద్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు’ అని అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘నాకు రజినీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి. మల్టీప్లెక్స్ నుంచి సింగిల్ స్క్రీన్ వరకు నన్ను అందరూ అంగీకరించే సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్, హ్యాపీ, ఫన్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తాను. నేను మొదటి సారి రొమాంటిక్ సినిమాలో క్లైమాక్స్ చూసి ఏడ్చాను. నేనే నటించాను కదా? ఎందుకు ఏడ్చాను అని అనుకున్నాను. కానీ ఆ ఎమోషనల్ అలాంటిది. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ క‌థ‌ను నమ్మి చేశాం. క్లైమాక్స్‌లో నన్ను కొట్టే సీన్ నుంచి.. చివరి సీన్ వరకు అమ్మ ఏడుస్తూనే వచ్చింది. అంతా చూశాక.. ఇంత బాగా ఎలా నటించావ్‌రా అని అన్నారు. నా నటనను చూసి అమ్మ ఎంతో సంతోషించారు. నాన్న గారు చూసిన సక్సెస్‌లు వేరు. ఆయన స్థాయికి నేను వచ్చాక.. కాలర్ ఎగిరేస్తారు. అది ఒక్క హిట్‌తో వచ్చేది కాదు. ఆ స్థాయికి వచ్చే వరకు ఎంత కష్టమైన పడతాను’ అని అన్నారు.

- Advertisement -