ఓక రొమాంటిక్ క్రైమ్ కథ, ఓక క్రిమినల్ ప్రేమకథ లాంటి సందేశాత్మక కమర్షియల్ హిట్ చిత్రాలు అందించమె కాకుండా కంటెంట్ వున్న చిత్రాలకు బడ్జెట్ లు అవసరం లేదని నిరూపించి టాలీవుడ్ లో ట్రెండ్ ని క్రియోట్ చేసిన పి.సునిల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం రోమాంటిక్ క్రిమినల్స్.. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటుంది.
ఓక రోమాంటిక్ క్రైమ్ కథ, ఓక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకి సీక్వెల్ గా రూపోందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్ల పై సంయుక్తంగా ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు ఆంద్రప్రదేశ్ విశాఖపట్నంలో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రోడక్షన్ స్టూడియో రిసాలి స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి.
దర్శకుడు పి.సునిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మా రోమాంటిక్ క్రిమినల్స్ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు నిర్మించారు. నటీనటులు కూడా చాలా చక్కగా పాత్రలో పరకాయప్రవేశం చేసి మరీ నటించారు. ముందు రెండు చిత్రాన్ని మించి వినోదం తో పాటు చక్కటి మెసెజ్ వుంటుంది. ఈ చిత్రానికి ఎస్.వి. శివరామ్ సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అవుతుంది, విశాఖ , అరకు లో ని అందాలే కాకుండా గంజాయ్ తోటల్లో పోలీసుల దాడి చేసే సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించాము. శామ్యూల్ కళ్యాణ్ ఎడిటింగ్ సినిమా ఫేస్ ని పెంచేలా వుంది. సుదాకర్ మారియో సంగీతం సారథ్యంలో నాలుగు పాటలు చాలా చక్కగా కుదిరాయి. త్వరలో ప్రముఖ ఆడియో సంస్థ ద్వారా ఆడియో ని విడుదల చేస్తాము. మే నేలలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని అన్నారు.
నటీనటులు… మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక , ఎఫ్.ఎమ్ బాబాయ్, బుగతా, సముద్రమ్ వెంకటేష్ తదితరులు..